గొంతు నొప్పని వెళ్తే.. విజిల్‌ బయటకు తీశారు!

కేరళలోని కన్నూర్‌ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఏళ్ల తరబడి దగ్గు సంబంధిత సమస్యతో బాధపడుతూ.. ఆస్పత్రికి వెళ్లిన మహిళ శ్వాస కోశాల్లో విజిల్‌ ఉండటాన్ని చూసి వైద్యులు అవాక్కయ్యారు.

Published : 18 Feb 2021 16:13 IST

కొచ్చి: కేరళలోని కన్నూర్‌ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఏళ్ల తరబడి దగ్గు సంబంధిత సమస్యతో బాధపడుతూ.. ఆస్పత్రికి వెళ్లిన మహిళ శ్వాసనాళం విజిల్‌ ఉండటాన్ని చూసి వైద్యులు అవాక్కయ్యారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో పరీక్షల సమయంలో ఈ విషయం బయటపడినట్లు అధికారులు మీడియాకు వెల్లడించారు. 

‘కన్నూరు జిల్లా మట్టనూరుకు చెందిన మహిళ ఇటీవల గొంతు సంబంధ సమస్యలతో స్థానికంగా వైద్యశాలకు వెళ్లింది. చాలా కాలం నుంచి సమస్య ఉన్నట్లు వైద్యుడికి వివరించింది. ఈ క్రమంలో స్థానిక వైద్యుడు ప్రభుత్వ వైద్య కళాశాలకు సిఫారసు చేశారు. వారి సిఫారసు మేరకు వైద్య కళాశాలను సంప్రదించిన బాధితురాలికి.. నిపుణులు రాజీవ్‌ రామ్‌, పద్మనాభం పరీక్షలు చేశారు. ఆమె శ్వాసనాళంలో ఓ వైపున విజిల్‌ వంటి చిన్న వస్తువు ఇరుక్కున్నట్లు గుర్తించారు. దీంతో వైద్యులు విజిల్‌ను బయటకు తీశారు’ అని సుదీప్‌ తెలిపారు. 

శరీరంలో నుంచి విజిల్‌ బయటకు తీశాక.. చాలా ఏళ్ల క్రితం తాను ఆ వస్తువును మింగిన విషయాన్ని ఆమె జ్ఞప్తికి తెచ్చుకున్నారని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆమె తన సమస్యల నుంచి బయటపడినట్లు వైద్యులు వెల్లడించారు. చాలా ఏళ్ల క్రితం ప్రమాదవశాత్తూ దాన్ని మింగినట్లు బాధితురాలు చెప్పారు. కానీ, అది లోపలే ఉండిపోయిన విషయాన్ని గ్రహించలేకపోయినట్లు ఆమె తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని