Lionel Messi: తనకోసం 3 లక్షల జనం వేచి ఉంది నిజమేనా..?

ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియోనెల్‌ మెస్సీకి బార్సిలోనా క్లబ్‌తో ఉన్న అనుబంధానికి తెరపడిన అనంతరం అతడు ఏ క్లబ్‌లో చేరబోతున్నాడనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఈ సందిగ్ధతకు తెరదించుతు మెస్సీ పారిస్‌ సెయింట్‌ జర్మన్‌ (పీఎస్‌జీ) క్లబ్‌లో చేరడానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే

Published : 14 Aug 2021 01:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియోనెల్‌ మెస్సీకి బార్సిలోనా క్లబ్‌తో ఉన్న అనుబంధానికి తెరపడిన అనంతరం అతడు ఏ క్లబ్‌లో చేరబోతున్నాడనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఈ సందిగ్ధతకు తెరదించుతూ మెస్సీ పారిస్‌ సెయింట్‌ జర్మన్‌ (పీఎస్‌జీ) క్లబ్‌లో చేరడానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఫ్రాన్స్‌లోని ఫుట్‌బాల్‌ అభిమానులు సంబరాలు చేసుకున్నారంటూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మెస్సీకి స్వాగతం పలికేందుకు 3 లక్షల మందికి పైగా ప్రజలు పారిస్ వీధుల్లో గుమిగూడి ఉన్నారనే వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఆ వీడియోను 2.8 లక్షల మంది వీక్షించారు. కానీ, మెస్సీ కోసం అంత పెద్ద సంఖ్యలో జనం పోటెత్తి రావడం నిజం కాదని నెట్టింట్లో మరొక వీడియో తెగ షేర్ అవుతోంది.

అసలు నిజం ఏంటంటే..?

మెస్సీ గురించి క్రీడాభిమానులు ఎదురుచూస్తున్న వీడియో ఫేక్‌ అని తేలింది. వారంతా మెక్కా స్పోర్ట్స్‌ బార్‌లో జరుగుతున్న మ్యాచ్‌ చూడటానికి వచ్చిన వారట. ఆ వీడియో మొదట్లో మెక్కా అని రాసి ఉన్నట్లుగా కనుగొన్నారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా లొకేషన్‌ను కూడా తెలుసుకున్నారు. ఈ వీడియో నిజానికి ఎన్‌బీఏ టీమ్, మిల్వాకీ బక్స్ టీం మధ్య జరుగుతున్న మ్యాచ్‌ చూడటానికి వచ్చినప్పుడు తీసిందని తెలిసింది. ఈ మ్యాచ్‌ అనంతరం వీధుల్లో పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడి సంబరాలు జరుపుకొన్నారు. ఆ వీడియోనే ఇప్పుడు మెస్సీ కోసం ఎదురుచూస్తున్నారంటూ సృష్టించి నెటిజన్లను తప్పుదోవ పట్టించారని తేలింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు