Dolo 650 Memes:ఐదు సమస్యలకు ఒక్కటే పరిష్కారం.. ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్న డోలో 650 మీమ్స్‌

దేశంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది.  నిన్న 15 లక్షల మందికిపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 1,41,986 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. మరోవైపు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ కేసులు

Published : 09 Jan 2022 02:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్: దేశంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 15 లక్షల మందికిపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 1,41,986 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోవైపు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 3,071 ఒమిక్రాన్ కేసులున్నాయి. అయితే, ‘తేలికపాటి’లక్షణాలున్న ఉన్న కొవిడ్‌ రోగులు చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా బారినపడిన వారు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యులు సూచించిన మందులను వాడితే కోలుకుంటారని పేర్కొంటున్నారు. 

అయితే, గతంలో కరోనా రోగులకు వైద్యులు సూచించిన మెడికల్‌ కిట్‌లో డోలో 650, అజిత్రోమైసిన్‌ 500 ఎంజి, మాంటెక్‌ ఎల్‌సీ, విటమిన్‌ సి, జింకోవిట్ మాత్రలు తప్పనిసరిగా ఉండేవి. (తలనొప్పి, ఒళ్లు నొప్పులు, పంటి నొప్పులు, జ్వరం, జలుబు) వంటి సమస్యలకు పరిష్కారంగా డోలో 650ని మాత్రలను వేసుకోవాలని వైద్యులు సూచిస్తారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండటంతో డోలోకు డిమాండ్ పెరిగిందంటూ నెటిజన్లు సరదాగా మీమ్స్ తయారుచేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఇవి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా 650 మేనియా ట్విటర్‌ని షేక్‌ చేస్తోంది. (తలనొప్పి, ఒళ్లు నొప్పులు, పంటి నొప్పులు, జ్వరం, జలుబు) ఐదు సమస్యలకు ఒక్కటే పరిష్కారం అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అందులో కొన్ని మీమ్స్‌ని చూసి మీరూ సరదాగా నవ్వుకోండి.










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని