
Air Passenger traffic: తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా పెరిగిన విమాన ప్రయాణికుల సంఖ్య..!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వదేశీ, విదేశీ విమాన ప్రయాణికుల సంఖ్య నవంబర్‌లో భారీగా పెరిగింది. గడిచిన 8 నెలల్లో విమాన ప్రయాణాలు రెట్టింపునకు మించాయి. గత ఏడాది నవంబర్‌లో.. 2 రాష్ట్రాల నుంచి 70,945 మంది విదేశాలకు రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది 1,74,427 మంది ప్రయాణించారు. ఇతర రాష్ట్రాలకు.. గడిచిన 8 నెలల్లో 79,24,569 మంది ప్రయాణించగా.. నవంబరులో 16,23,198 మంది రాకపోకలు సాగించారు. ఈ ఏడాది నవంబర్‌లో స్వదేశీ విమాన ప్రయాణీకుల సంఖ్యను గతేడాది ఇదే నెలలో ప్రయాణాలు చేసిన వారితో పోల్చితే.. దాదాపు 5 లక్షల మంది అధికంగా ఉన్నట్లు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి.
► Read latest General News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.