
ఏపీ సీఎంఆర్ఎఫ్కు రూ.కోటికిపైగా విరాళాలు
కాకినాడ: కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా పలు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతుగా చేయూతనిస్తున్నాయి. ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పలు సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1,33,34,844 విరాళంగా అందించాయి. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయిస్ యూనియన్( విజయవాడ) రూ.14.20లక్షలు, వేద సీడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.10లక్షలు, ఏపీ ఆయిల్ ఫెడరేషన్ అధ్యక్షుడు పీవీఎస్ఎస్ మూర్తి రూ.15 లక్షలు సీఎం సహాయనిధికి విరాళంగా అందించారు. కాకినాడ ట్రస్టు ఆస్పత్రి రూ. 1 లక్ష , భవానీ కాస్టింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 5 లక్షలు విరాళంగా అందించాయి. కాళీశ్వరీ రిఫైనరీ అండ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25లక్షలు సహా పలు సంస్థలు విరాళం ఇచ్చాయి. విరాళాలకు సంబంధించిన చెక్కులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు సీఎం జగన్కు అందజేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.