Eating: భోజనం చేసిన తర్వాత ఈ పనులు చేస్తున్నారా..? ఏమౌతుందో తెలుసుకోండి..!

భోజనం ఓ పవిత్ర కార్యం..దాన్ని జాగ్రత్తగా పూర్తి చేయడంతో ఆరోగ్యం మన వశం అవుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కొత్త జబ్బులను పెంచి పోషించుకోవడమే అవుతుందని ఆహార నిఫుణులు చెబుతున్నారు. అసలు భోజనం చేయడానికి ముందు, తర్వాత ఏం చేయాలో..ఏం చేయకూడదో నిపుణులు పలు సూచనలు చేశారు.

Updated : 28 Sep 2022 16:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భోజనం ఓ పవిత్ర కార్యం..దాన్ని జాగ్రత్తగా పూర్తి చేయడంతో ఆరోగ్యం బాగుంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కొత్త జబ్బులను పెంచి పోషించుకోవడమే అవుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. అసలు భోజనం చేయడానికి ముందు, తర్వాత ఏం చేయాలో..ఏం చేయకూడదో నిపుణులు పలు సూచనలు చేశారు. వీటిని ఆచరించి చూస్తే కలిగే మేలేంటో తెలుసుకుందామా..?

* భోజనం చేసిన తర్వాత చాలామందికి ఓ కునుకు వేయడం అలవాటు. నిజానికి మధ్యాహ్నం పూట కాసేపు కునుకు తీయడం మంచిదే అయినా తిన్న వెంటనే నిద్ర పోవద్దు. ఎందుకంటే పొట్టలోని ఆహారాన్ని జీర్ణం చేయడానికి విడుదలయ్యే రసాలు మరింత అధికంగా ఉత్పత్తి అవుతాయి.

* ఫలితంగా గుండెలో మంట, అజీర్తి లాంటి సమస్యలు వస్తాయి. అందుకే భోజనం చేసిన తర్వాత అరగంట ఆగాల్సిందే. అదే రాత్రిపూట భోజనం తొందరగా తినాలి. గంట తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి.

* ఆహారం తినగానే స్నానం చేయడం కొంతమందికి అలవాటు. ఇది సరికాదని గుర్తుంచుకోవాలి. అది జీర్ణం కావడానికి ఎక్కువ రక్త ప్రసరణ అవసరం. స్నానం చేయడంతో రక్త ప్రసరణ చర్మం వైపు వెళ్లి ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం కావాల్సి వస్తుంది. అజీర్తి లాంటి సమస్యలు వస్తాయి.

* కొంతమందికి భోజనం కాగానే టీ, కాఫీ అలవాటు ఉంటుంది. దీంతో ఆహారంలోని పోషకాలను గ్రహించే శక్తి శరీరానికి క్రమంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

* తిన్న వెంటనే నీటిని గడగడ తాగేయడం సరికాదు. అలా చేస్తే తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి, పొట్టలో ఉత్పత్తయ్యే ఎంజైమ్స్‌, జీర్ణ రసాలు తక్కువగా విడుదల అవుతాయి. దీంతో ఆహారం సరిగా జీర్ణం కాదు. గంట తర్వాత నీటిని తాగితే మంచిది.

* భుజించిన వెంటనే ఏదో ఒక పండు తింటాం. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతారు. భోజనం తర్వాత కాకుండా అల్పాహారం తర్వాతగానీ సాయంత్రం వేళగానీ ఏదైనా పండును తీసుకోవడం మరింత మేలు చేస్తుంది.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని