Food Fry: వేపుళ్లను తింటే ఆరోగ్యం ఏమవుతుందో గమనించారా..! గృహిణులు తెలుసుకోండి

పిల్లలు అడిగారనో..భర్త కోరాడనో కొన్ని వంటలను చక్కగా నూనెలో వేయించి పెడుతారు. కనీసం వారానికోసారయినా ఇలాంటివి తినడానికి అందరూ ఇష్టపడుతారు. ఈ ఆహారంతో వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. చేతులారా మనమే మధుమేహం, అధిక రక్తపోటు, శరీరంలో కొవ్వును పెంచుకుంటాం.

Published : 05 Oct 2022 01:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లలు అడిగారనో..భర్తకు ఇష్టమని కొన్ని వంటలను చక్కగా నూనెలో వేయించి పెడుతారు. కనీసం వారానికోసారయినా ఇలాంటివి తినడానికి అందరూ ఇష్టపడుతుంటారు. ఈ ఆహారంతో వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. చేతులారా మనమే మధుమేహం, అధిక రక్తపోటు, శరీరంలో కొవ్వును పెంచుకుంటాం. అధిక బరువుతో సతమతమవుతామని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్యం గురించి కూడా గృహిణులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.

వీటిని పరిశీలించండి..!

* ఆలూచిప్స్‌, ఫ్రెంచ్‌ఫ్రైస్‌. ఫ్రైడ్‌ ఫిష్‌, చికెన్‌ స్ట్రిప్స్‌, కబాబ్స్‌, చిల్లీ చికెన్‌ ఈ పేర్లు వింటుంటే నోరూరుతోంది కదా..వేపుళ్లు చూస్తేనే కాదు..తింటే మరీ బాగుంటాయి.

* మరగకాగిన నూనెల్లో వేయించిన వీటితోనే అసలు చిక్కొచ్చి పడుతోంది. వీటితో ఆరోగ్యానికి చేటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

* వేపుళ్ల నుంచి వచ్చే కేలరీలు చాలా ఎక్కువ. వేడి వేడి నూనెలో వేసి తీయడంతో అందులోని నీరంతా ఆవిరి అయిపోతుంది. అవి నూనెను బాగా పీల్చుకుంటాయి.

* వీటిని తరచుగా తింటుంటే ఊబకాయం, మధుమేహం లాంటి చాలా రకాల జబ్బులు పొంచి ఉంటాయి. అధిక రక్తపోటు సమస్య కూడా ఎక్కువగా ఉంటుందని గుర్తించాలి. మంచి కొవ్వును తగ్గించడంతో గుండె జబ్బులు అధికం అవుతాయి. 

* కాచిన నూనెను మళ్లీ మళ్లీ వాడటంతో వాటిలో ఉండే ప్రమాదకర ట్రాన్స్‌ప్యాట్స్‌ స్థాయిలు మరింత పెరుగుతాయి. వీటితో గుండె జబ్బులు అధికంగా వస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని