పెట్టుబడులు మర్చిపోకండి!

మదుపు చేయండి.. మర్చిపోండి.. సాధారణంగా ఆర్థిక నిపుణులు చెప్పే సూచన ఇదే. దీర్ఘకాలంపాటు పెట్టుబడులు కొనసాగించాలనేందుకు దీన్ని వాడుతుంటారు. అయితే, చాలామంది తాము పెట్టిన పెట్టుబడుల గురించి పూర్తిగా మర్చిపోతుంటారు. కనీసం కుటుంబ సభ్యులకూ వాటి విషయాన్ని చెప్పరు. దీనివల్ల తమ పెట్టుబడులకు ఏ ప్రయోజనం లేకుండా మారిపోతోంది.

Updated : 08 Dec 2022 19:56 IST

పెట్టుబడులు మర్చిపోకండి!

మదుపు చేయండి.. మర్చిపోండి.. సాధారణంగా ఆర్థిక నిపుణులు చెప్పే సూచన ఇదే. దీర్ఘకాలంపాటు పెట్టుబడులు కొనసాగించాలనేందుకు దీన్ని వాడుతుంటారు. అయితే, చాలామంది తాము పెట్టిన పెట్టుబడుల గురించి పూర్తిగా మర్చిపోతుంటారు. కనీసం కుటుంబ సభ్యులకూ వాటి విషయాన్ని చెప్పరు. దీనివల్ల తమ పెట్టుబడులకు ఏ ప్రయోజనం లేకుండా మారిపోతోంది.

కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే.. అతనికి సంబంధించిన పెట్టుబడుల వివరాలు తెలియకపోవడంతో ఆ మొత్తాలను వెనక్కి తీసుకోకపోవడంతో కొన్ని కోట్ల రూపాయలు బ్యాంకులు, బీమా సంస్థలు, డీమ్యాట్‌ తదితరాలలో ఉండిపోతున్నాయి. వీటికి కారణం.. పెట్టుబడులు పెట్టిన వ్యక్తి తన పెట్టుబడుల గురించి ఎవరికీ కనీస సమాచారం తెలియనీయకపోవడం.. నామినీ పేరును కూడా పేర్కొనకపోవడం.

* బీమా పాలసీలు తీసుకునేది మన కుటుంబానికి ఆర్థిక రక్షణకోసమే కదా! మరి, మీరు ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకపోతే ఎలా? మీరు తీసుకున్న పాలసీల వివరాలన్నీ ఒకచోట రాసి పెట్టండి. ఏ పాలసీకి ఎవరు ఏజెంటో వారి ఫోన్‌ నెంబరును కూడా తెలియజేయండి. నామినీ పేరు ఎవరిది రాశారో చూసుకోండి. ఒకవేళ పేర్కొనకపోతే వెంటనే, నామినీ పేరును బీమా పాలసీలో చేర్పించండి.
*డీమ్యాట్‌ ఖాతాలకు, మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులకు కూడా నామినీ ఎంతో అవసరం. లేకపోతే.. ఏదైనా జరిగినప్పుడు.. ఆ డబ్బును ఎవరికి ఇవ్వాలో తెలియక ఇబ్బందులు ఎదురవుతాయి. పెట్టుబడుల గురించి తెలిస్తే.. ఎలాగోలా వారసత్వ ధ్రువీకరణలు పెట్టి తీసుకోవచ్చు. కానీ, అసలు తెలియకపోతే.. మీరు పెట్టిన పెట్టుబడులన్నీ ఎవరికీ పనికిరాకుండా పోయినట్లే! అవునా? అందుకే, ఒకసారి మీ డీమ్యాట్‌, మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించండి. నామినీ పేరు ఉందా చూసుకోండి.
*ఇక బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సంగతి కొంత ప్రత్యేకం. వీటిని ఎప్పటికప్పుడు పట్టించుకోవాలి. బ్యాంకు ఖాతాకు నామినీ పేరు ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా బ్యాంకులు డిపాజిట్‌ చేసేప్పుడే వ్యవధి తీరిన తర్వాత సొమ్ము తీసుకుంటారా? లేక ఆటో రెన్యువల్‌ చేయాలా అని అడుగుతుంటాయి. ఆటో రెన్యువల్‌ ఎంచుకోవడం వల్ల గడువు తీరగానే బ్యాంకుకు వెళ్లి, తిరిగి డిపాజిట్‌ చేయాల్సిన అవసరం ఉండదు. దాదాపు 90శాతం మంది ఇలా ఆటో రెన్యువల్‌కే మొగ్గు చూపిస్తారని బ్యాకింగ్‌ నిపుణులు అంటున్నారు. పెట్టుబడుల గురించి ఆలోచించడానికి సరైన సమయం చిక్కని వారంతా ఆటో రెన్యువల్‌ ఎంచుకోవడమే మంచిది. అయితే, దీనివల్ల కొన్ని నష్టాలూ ఉన్నాయన్న సంగతి మాత్రం మర్చిపోకూడదు.
*ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గుతున్న దశలో ఉన్నాయి. అదే వ్యవధికి వేరే బ్యాంకు కొంత ఎక్కువ వడ్డీ ఇస్తుండవచ్చు. ఇలాంటప్పుడు ఆటో రెన్యువల్‌ వల్ల నష్టపోవాల్సి వస్తుంది.
*ఫిక్సెడ్‌ డిపాజిట్‌ ఆటో రెన్యువల్‌ పెట్టుకుంటే.. గడువు తీరేలోగా దాన్ని మార్చుకోవచ్చు. గడువు రోజు కూడా బ్యాంకుకు వెళ్లి దాన్ని వద్దనేందుకు వీలుంది. కానీ, ఒక్కసారి పునరుద్ధరణ అయ్యాక దాన్ని తిరిగి తీసుకోవాలంటే.. రుసుము భరించాల్సిందే.
*ఆటో రెన్యువల్‌ కన్నా కూడా.. వ్యవధి ముగియగానే నేరుగా మీ ఖాతాలోకి సొమ్ము వచ్చి చేరేలా సౌకర్యాన్ని ఎంచుకోవడం మేలు. ఇప్పుడు సేవింగ్‌ బ్యాంకు ఖాతాకు కూడా 4శాతం వడ్డీ ఇస్తున్నారు. కాబట్టి, డిపాజిట్‌ చేయడానికి కొంత సమయం తీసుకున్నా పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు