Bananas: అరటిపండే కదా తీసి పారేయకండి..!

చక్కని పసుపు, బంగారం రంగులో ఉండే అరటి పండ్లంటే అందరికీ ఇష్టమే..ఎన్నో పోషకాలుండే ఈ పండ్లతో ఒనగూరే ప్రయోజనాలెన్నో ఉన్నాయి. కానీ అరటి పండ్లపై నల్లటి మచ్చ ఉంటే హాని కారకమని చాలా మంది నమ్ముతుంటారు.

Published : 08 Aug 2022 02:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చక్కని పసుపు, బంగారం రంగులో ఉండే అరటి పండ్లంటే అందరికీ ఇష్టమే..ఎన్నో పోషకాలుండే ఈ పండ్లతో ఒనగూరే ప్రయోజనాలెన్నో ఉన్నాయి. కానీ అరటి పండ్లపై నల్లటి మచ్చ ఉంటే హాని కారకమని చాలా మంది నమ్ముతుంటారు. నల్లమచ్చలున్న అరటి పండ్లను తినకూడదా..? తింటే ఏం అవుతుందో తెలుసుకోండి..!

🍌 అరటి పండ్లు తొందరగా జీర్ణం అవుతాయి. సహజ పోషకాలను సత్వరం అందిస్తాయి.

🍌 అరటి పండ్లపై నల్లని మచ్చలుంటే కుళ్లినవని కాదు..నలుపు, గోధుమవర్ణం మచ్చలు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచివని నిపుణులు చెబుతున్నారు.

🍌 నల్లమచ్చలు టీఎన్‌ఎఫ్‌(ట్యూమర్‌ నిక్రోసిస్‌ ఫ్యాక్టర్‌)సూచిస్తాయి. ఇది క్యాన్సర్‌ పోరాట పదార్థం. ఇది శరీరంలోని  అసాధారణ కణాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.

🍌 బాగా పండినపుడు యాంటీ అక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది వైరస్‌, క్యాన్సర్‌ కణాలకు వ్యతిరేకంగా రోగనిరోధకతను పెంచుతుంది. 

🍌 అరటిపండ్లు పండే కొద్దీ మెగ్నిషియం పెరుగుతుంది. రక్తపోటుతో బాధ పడుతున్న వారికి చాలా మంచిది. తక్షణమే అధిక రక్తపోటును తగ్గిస్తుంది.

🍌 గుండెకు చాలా మేలు చేస్తాయి. పేగుల్లో కదలికలను బాగా ఉంచుతుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు సహకరిస్తుంది. అసిడిటీని బాగా తగ్గిస్తుంది.

🍌 ఇందులో పీచు పదార్థం కూడా అధికంగానే ఉంటుంది. మల బద్దకం లేకుండా చేస్తుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని