Telangana News: డిగ్రీ ప్రవేశాల కోసం.. దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో ఇంటర్‌ ఉత్తీర్ణులై డిగ్రీలో చేరే విద్యార్థుల కోసం దోస్త్‌ నోటిఫికేషన్‌ బుధవారం విడుదలైంది.  డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ను ఉన్నత

Updated : 29 Jun 2022 17:23 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ ఉత్తీర్ణులై డిగ్రీలో చేరే విద్యార్థుల కోసం దోస్త్‌ నోటిఫికేషన్‌ బుధవారం విడుదలైంది.  డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు.. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని 1,060 కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల్లో దాదాపు 4,25,000 సీట్లను భర్తీ చేయనున్నారు. 3 లేదా నాలుగు విడతల్లో డిగ్రీ సీట్లను భర్తీ చేయనున్నారు. దోస్త్ వెబ్ సైట్, టీఎస్ యాప్ ఫోలియో లేదా యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని సహాయ కేంద్రాల ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. జులై 1 నుంచి 30 వరకు మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు చేపడతామని అధికారులు వెల్లడించారు. జులై 6 నుంచి 30 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు.

  • ఆగస్టు 6న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
  • ఆగస్టు 7 నుంచి 18 వరకు విద్యార్థుల సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 
  • ఆగస్టు 7 నుంచి 21 వరకు రెండో విడత దోస్త్‌ రిజిస్ట్రేషన్‌
  • ఆగస్టు  7 నుంచి 22 వరకు రెండో విడత వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం
  • ఆగస్టు 27న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
  • ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 12 వరకు మూడో విడత దోస్త్‌ రిజిస్ట్రేషన్‌
  • ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 12 వరకు మూడో విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం
  • సెప్టెంబర్‌ 16న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
  • అక్టోబర్‌ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని