Andhra News: పట్టాలపై తెగిపడిన విద్యుత్తు తీగలు.. పలుచోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం

బాపట్ల జిల్లా వేటపాలెం రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న సంతరావూరు రైల్వే గేటు వద్ద గూడూరు- విజయవాడ రైల్వే ట్రాక్‌పై శనివారం రాత్రి  హైటెన్షన్‌ విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి.

Updated : 29 Jan 2023 01:10 IST

వేటపాలెం: బాపట్ల జిల్లా వేటపాలెం రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న సంతరావూరు రైల్వే గేటు వద్ద గూడూరు- విజయవాడ రైల్వే ట్రాక్‌పై శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో హైటెన్షన్‌ విద్యుత్తు తీగలు తెగి, అప్‌లైన్‌(విజయవాడ-చెన్నై ట్రాక్‌) పై పడ్డాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీనివల్ల చీరాల రైల్వే స్టేషనులో పాట్నా-ఎర్నాకుళం సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్, ఇదే ట్రాక్‌పై చీరాలకు మధ్యలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్, వేటపాలెం- చినగంజాం మధ్య పద్మావతి ఎక్స్‌ప్రెస్, ఒంగోలు రైల్వే స్టేషనులో చార్మినార్‌, డీటీ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి. విద్యుత్తు తీగలు తెగడం వల్ల విజయవాడ-చెన్నై-విజయవాడ మార్గంలో పలు చోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వేటపాలెం రైల్వేస్టేషనులో అప్‌లైనులో మరమ్మతులు పూర్తయ్యాయి. డౌన్‌లైనులో మరమ్మతులు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని