Remdesivir అందరికీ అవసరం లేదు
దేశంలో కరోనా బారిన పడుతున్నవారు, మహమ్మారి సోకి మృతిచెందుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా రెమ్‌డెసివిర్ అనే ఇంజక్షన్ గురించే చర్చంతా....
ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రముఖ వైద్యుడు గురవారెడ్డి
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా బారిన పడుతున్నవారు, మహమ్మారి సోకి మృతిచెందుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ గురించే చర్చంతా. ఈ ఆంటీ వైరల్ మందు అంత మంచి ఫలితాలు ఇస్తోందా? నిజంగా అది ఎవరికి అవసరం? తదితర అంశాలపై ప్రముఖ వైద్యుడు డాక్టర్ గురవారెడ్డితో ఈటీవీ ముఖాముఖి నిర్వహించింది. కాగా ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్, టొసిలిజుబాబ్ గురించి పెద్ద స్థాయిలో చర్చ సాగుతోంది. రెమ్‌డెసివిర్‌ను ప్రైవేటులో రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. అసలు రెమ్‌డెసివిర్ ఎలాంటి ఫలితాలు ఇస్తుంది?
రెమ్‌డెసివిర్‌ను సంజీవని, ప్రాణదాత అంటున్నారు. అది తీసుకుంటే కొవిడ్‌ను జయించగలం అనే వార్త విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. కానీ అది అవాస్తవం. వైరల్ లోడ్‌ను కొంతవరకు తగ్గించేందుకు మాత్రమే రెమ్‌డెసివిర్ ఉపయోగపడుతుంది. ఒక ప్రత్యేక సమయంలో ఇస్తే మాత్రమే అది కొంతమేర పనిచేస్తుంది.
వైరస్ సోకినవారికి ఏ సమయంలో ఈ ఇంజక్షన్ ఇవ్వాలి?
ఆక్సిజన్ అవసరమైనప్పుడు మాత్రమే రెమ్‌డెసివిర్ ఇవ్వాలని గైడ్‌లైన్స్ ఉన్నాయి. ఆక్సిజన్ అవసరం లేనివారికి ఈ ఇంజక్షన్ అవసరం లేదు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నవారిపై కూడా ఇది పనిచేయదు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి రెమ్‌డెసివిర్ అక్కర్లేదు.
రెమ్‌డెసివిర్ లభించక ప్రజలు ఆసుపత్రులు, మెడికల్ దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ కొరతను తీర్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి?
బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలంటే ప్రజల్లో అవగాహన పెంచాలి. అందరికీ ఈ ఇంజక్షన్ అవసరం లేదని తెలియజేయాలి. వైద్యులు కూడా ప్రతి ఒక్కరికీ రెమ్‌డెసివిర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరమైనవారికే ఇవ్వాలి.
టొసిలిజుమాబ్ గురించి కూడా ఈమధ్య ఎక్కువ చర్చ సాగుతోంది. కొవిడ్ బాధితులపై ఇది ఎలా పనిచేస్తుంది?
రెమ్‌డెసివిర్, టొసిలిజుమాబ్ ఈ రెండు పూర్తిగా వేర్వేరు మందులు. వెంటిలేటర్ మీద ఉన్నవారికి టొసిలిజుమాబ్ ఉపయోగపడుతుంది. ఇది కూడా ప్రాణాలను కాపాడుతుంది అనే గ్యారంటీ లేదు. స్టెరాయిడ్స్ మాత్రమే బాగా పనిచేస్తున్నాయని నిరూపితమైంది.
స్టెరాయిడ్స్ తీసుకున్నవారిలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు సమాచారం. నిజంగా అలా జరుగుతుందా?
స్టెరాయిడ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ చాలా ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోక తప్పదు. వాటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను భరించక తప్పదు.
మొదటి దశతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? హోం ఐసోలేషన్‌లో తలెత్తుతున్న ప్రధాన ఇబ్బందులు ఏమిటి?
హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి జబ్బు నయమవుతోంది. దీంతో ప్రజల్లో ధైర్యం పెరిగింది. 95 శాతం బాధితులకు ఆసుపత్రి చికిత్స అవసరం లేదు. లక్షణాలు ఉన్న 5 శాతం మందికి మాత్రమే ఆసుపత్రి చికిత్స అవసరం.
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కొవిడ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీ అభిప్రాయం?
ప్రభుత్వం ఏమీ చేయలేదు. లాక్డౌన్ విధించలేని పరిస్థితి. ప్రజల్లో మార్పు రావాలి. వారు పాటించే పద్ధతుల్లో మార్పు రావాలి. అవసరమైతేనే బయటకు రావాలి. మాస్కులు ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ తగిన జాగ్రత్తలు పాటించాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
-
India News
Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్
-
Technology News
Cola Phone: కోకాకోలా కొత్త స్మార్ట్‌ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
World News
Pakistan: పాక్ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి