Dry Friuts: వయసును తగ్గించే వీటిని తింటున్నారా!

వయసును ఎలా తగ్గిస్తారు అనుకుంటున్నారా! వయసు వచ్చినా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటమే వయసు తగ్గించుకోవటం. చాలామంది వయసు మళ్లిన ఛాయలు కనిపించకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఆ ప్రయత్నం ఆరోగ్యంగా ఉంటే ఎంత బాగుంటుంది. మనం తీసుకునే ఆహారమే మనకు సహాయపడుతుంది. అవేంటో తెలుసుకుందామా!

Published : 18 Oct 2022 01:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలామంది వయసు మళ్లిన ఛాయలు కనిపించకుండా ఉండేందుకు ఎన్నో రకాల ట్రీట్‌మెంట్లు చేయించుకుంటూ ఉంటారు. వేలకు వేలు డబ్బులు పెట్టినా ఫలితాలు రాక నష్టపోయిన వారున్నారు. మనం తినే ఆహారంతో ఆరోగ్యం సొంతమైతే ఇతర ట్రీట్‌మెంట్ల అవసరమేముంటుంది?  కాబట్టి రుచిగా ఉండి ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని తీసుకోవటం మంచిది. 

* బాదం.. 
ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో బాదం ఒకటి. ఇందులో ఉండే విటమిన్‌ ఈ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. చర్మం ముడతలు పడకుండా ఉండేందుకు సహాయం చేస్తుంది. 

* పిస్తా..
పిస్తాల్లో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు  ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సీడెంట్లు చర్మంపై మొటిమలు రాకుండా సహాయపడతాయి. 

* జీడిపప్పు.. 
శరీరానికి కావాల్సిన మినరల్స్‌, అమైనో ఆమ్లాలు, ఫైబర్‌  జీడిపప్పులో పుష్కలంగా దొరుకుతాయి. వీటిని నేరుగా కూడా తీసుకోవచ్చు. 

* డేట్స్..

* తక్షణ శక్తిని అందించే వాటిల్లో డేట్స్ ఒకటి. ఇవి రోజూ తినటం వల్ల ఉత్సాహంగా ఉంటారు. 

* ఉదయం లేవగానే నానబెట్టిన బాదం పలుకులు తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. స్నాక్స్‌గా డ్రైఫ్రూట్స్‌ తీసుకోవాలి. 

* డ్రైఫ్రూట్స్ తో లడ్డూ చేసికొని తిన్నా మేలే. 

* జీడిపప్పుతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇవి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. 

* బయటకు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. బ్యాగులో ఎప్పుడూ డ్రైఫ్రూట్స్ బాక్స్‌ తీసుకెళ్లడం ఉత్తమం. దీంతో ఎప్పుడైనా ఆకలేస్తే తినేయవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని