DSP Transfers in AP: ఆంధ్రప్రదేశ్‌లో 50 మంది డీఎస్పీల బదిలీ

రాష్ట్రంలో 50 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీతో పాటు పోస్టింగ్‌ వచ్చినటువంటి అధికారులు తక్షణం విధుల్లో చేరాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. 

Updated : 06 May 2023 16:24 IST

అమరావతి: రాష్ట్రంలో 50 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీతో పాటు పోస్టింగ్‌ వచ్చినటువంటి అధికారులు తక్షణం విధుల్లో చేరాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఒంగోలు డీఎస్పీగా చేరిన రెండు రోజుల్లోనే అశోక్‌ వర్దన్‌ను మళ్లీ బదిలీ చేసి దర్శి డీఎస్పీగా నియమించారు. ఒంగోలు డీఎస్పీగా నారాయణస్వామి రెడ్డిని నియమించారు. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరుకున్న హరినాథ్‌ రెడ్డిని సైతం అనంతపురం పీటీసీకి బదిలీ చేశారు.

కనిగిరి డీఎస్పీగా రామరాజును నియమించగా.. అమలాపురం ఎస్డీపీఓగా అంబికా ప్రసాద్‌, ఏసీబీ డీఎస్పీగా ఉన్న ఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ను రామచంద్రాపురం ఎస్డీపీఓగా, మార్కాపురం డీఎస్పీ కిషోర్‌ కుమార్‌ను రాజమహేంద్రవరం ఈస్ట్‌ డీఎస్పీగా బదిలీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న 24మంది డీఎస్పీలను వేర్వేరు చోట్ల పోస్టింగ్‌ ఇస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

 బదిలీ అయిన వారి వివరాలు ఇలా..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని