RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టికెట్లు ఉచితం.. గుంటూరులో గ్యాస్‌ ఏజెన్సీ బంపర్ ఆఫర్‌

పాన్‌ ఇండియా చిత్రం ‘RRR’కు ఇప్పుడున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందుకే ఆ క్రేజ్‌ను ఓ గ్యాస్‌ ఏజెన్సీ కూడా తమ సేవల వృద్ధి కోసం వాడుకుంటోంది.

Updated : 19 Mar 2022 05:08 IST

గుంటూరు: పాన్‌ ఇండియా చిత్రం ‘RRR’కు ఇప్పుడున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందుకే ఆ క్రేజ్‌ను ఓ గ్యాస్‌ ఏజెన్సీ కూడా తమ సేవల వృద్ధి కోసం వాడుకుంటోంది. సింగిల్‌ సిలిండర్‌ ఉన్న వినియోగదారులు రెండో సిలిండర్‌ తీసుకుంటే ఆర్ఆర్‌ఆర్‌ సినిమా టికెట్లు ఉచితంగా ఇస్తామంటోంది. గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీ ఈ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. అంతటితో ఆగకుండా తమ ఏజెన్సీ ఆఫీసు ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. గతంలో బాహుబలి-2 టికెట్లు కూడా ఇలా ఉచితంగా అందించింది. సినిమా విడుదల రోజే ఇంటికెళ్లి మరీ టికెట్లు ఇస్తామని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వినియోగదారులు ఇప్పటికే ఏజెన్సీని సంప్రదించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని