Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. లలితా త్రిపుర సుందరీదేవిగా కనక దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు.

Updated : 30 Sep 2022 12:43 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.

లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం విశిష్టత..

త్రిపురాత్రయంలో లలితా త్రిపుర సుందరీదేవి రెండో దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో, సకల లోకాతీత కోమలత్వంతో ప్రకాశిస్తుంది. ఈ తల్లి మణిద్వీప నివాసిని. సకల సృష్టి, స్థితి, సంహార కారిణి, శ్రీవిద్యా స్వరూపిణి. ఉపాసకులకు ముఖ్య ఆరాధ్య దేవత. ‘చిదగ్నికుండ సంభూతా’ అని లలితా సహస్రనామం చెబుతోంది. సకల విశ్వచైతన్య శక్తి స్వరూపం శ్రీచక్రం. ఈ శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత లలితా త్రిపురసుందరి. కోటి సూర్యుల ప్రకాశంతో సమానమైన కాంతి స్వరూపంతో, చేతిలో పాశం, అంకుశం, చెరకు విల్లు, పూలబాణాలు ధరించి ఉంటుంది. ఈమెకు లక్ష్మీసరస్వతులు.. వింజామరలతో వీస్తూ సేవలు చేస్తుంటారు. లలితా త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే సకల ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని