
South central Railway: దసరాకు ఊరెళ్తున్నారా? ప్రత్యేక రైళ్లు.. వాటి రూట్‌లు ఇవే..!
ఇంటర్నెట్ డెస్క్: దసరా పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లేందుకు రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 22 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు పలు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్లకు సంబంధించి వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ ప్రత్యేక రైళ్లను నడిపే తేదీలు, రైలు నంబర్, ఏ స్టేషన్‌లో ఎన్ని గంటలకు బయల్దేరుతుంది.. గమ్యస్థానానికి చేరే సమయమెంత? తదితర వివరాలు ఇవిగో..! లాక్‌డౌన్ తరువాత రైల్వేలు పూర్వపుస్థాయిలో రైలు సర్వీసులను ఇంకా పునరుద్ధరించలేదు. రెగ్యులర్ సర్వీసులకే స్పెషల్స్ అని నడిపిస్తున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.