Indrakeeladri: మూలానక్షత్రం.. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో దుర్గగుడికి భక్తులు పోటెత్తారు.

Updated : 02 Oct 2022 11:10 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజు కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో దుర్గగుడికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే బారులు తీరారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఈ ఒక్కరోజే అమ్మవారిని 2లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని అధికారులు భావిస్తున్నారు.

సరస్వతీదేవి అలంకారం విశిష్టత..

మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన తర్వాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీదేవిగా అలంకరిస్తారు. ఈ రూపంలో అమ్మను దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహం పొంది సర్వ విద్యల్లో విజయం సాధిస్తారని నమ్మకం. మూలానక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి దుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానజ్యోతిని వెలిగించే సరస్వతీదేవి దర్శనం.. అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకమని భక్తుల ప్రగాఢ నమ్మకం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని