TSRTC ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో ‘డైనమిక్‌ ప్రైసింగ్‌’!

ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో డైనమిక్‌ ప్రైసింగ్‌ను అమలు చేయాలని టీఎస్‌ఆర్టీసీ (TSRTC)నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా బెంగళూరు మార్గంలో నడిచే సర్వీసుల్లో ఈ నెల 27 నుంచి అమలు చేయనున్నారు.

Published : 23 Mar 2023 18:43 IST

హైదరాబాద్‌:  తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో ‘డైనమిక్‌ ప్రైసింగ్‌’ను అమలు చేయాలని నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా బెంగళూరు మార్గంలో నడిచే 46 సర్వీసుల్లో ఈ నెల 27 నుంచి అమలు చేయనుంది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ రెడ్డితో కలిసి ఎండీ సజ్జనార్‌ సంబంధిత వివరాలను మీడియాకు వెల్లడించారు. విమానాలు, హోటళ్లు, ప్రైవేట్‌ బస్‌ ఆపరేటర్లు ఇప్పటికే ఈ విధానం అమలు చేస్తున్నాయని తెలిపారు. త్వరలోనే ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సదుపాయమున్న సర్వీసులన్నింటిలోనూ ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు  కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విధానంలో డిమాండ్‌ను బట్టి టికెట్‌ ధరలో మార్పు ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని