Munugode bypoll: తెరాస ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. రాజగోపాల్‌రెడ్డికి నోటీసు జారీ

మునుగోడు భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. రేపు సాయంత్రం 4గంటల్లోగా సమాధానం చెప్పాలని, వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఈసీ నోటీసులో పేర్కొంది.

Published : 31 Oct 2022 01:48 IST

హైదరాబాద్‌: మునుగోడు భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. రాజగోపాల్‌రెడ్డి దాదాపు రూ.5.24 కోట్లను స్థానిక వ్యాపారులు, వ్యక్తులకు చెందిన 22 బ్యాంకు ఖాతాలకు మళ్లించారని, ఆ డబ్బంతా మునుగోడు ఉప ఎన్నికల్లో పంపిణీ చేయడం కోసమేనని తెరాస ప్రధాన కార్యదర్శి భరత్‌ కుమార్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పలు పత్రాలను ఈసీకి సమర్పించారు. ఆ ఖాతాల నుంచి డబ్బులు తీసుకోకముందే 22 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని కోరారు. ఎన్నికల నేపథ్యంలో ఈ తరహాలో భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెరాస ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం రాజగోపాల్‌రెడ్డికి నోటీసు జారీ చేసింది. రేపు సాయంత్రం 4గంటల్లోగా  సమాధానం చెప్పాలని, వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఈసీ నోటీసులో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని