JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తెదేపా మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సంస్థకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
తాడిపత్రి: తెదేపా మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సంస్థకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన సంస్థల బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్లు ఈడీ పేర్కొంది. దివాకర్ రోడ్‌లైన్స్, ఝటధార ఇండస్ట్రీస్ ఆస్తులు, సి.గోపాల్ రెడ్డి అండ్‌కోకు సంబంధించిన కంపెనీ ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపింది. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడైన కాంట్రాక్టర్ గోపాల్‌రెడ్డి కంపెనీ ఆస్తులను సైతం అటాచ్ చేసింది.
సుమారు రూ.22.10కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. ‘‘సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఝటధార ఇండస్ట్రీస్, గోపాల్ రెడ్డి అండ్ కో కంపెనీలు అశోక్‌లేలాండ్ నుంచి తక్కువ ధరకే బీఎస్-4 వాహనాలను కొనుగోలు చేశాయి. నాగాలాండ్, కర్ణాటక, ఏపీలో తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించాయి. రూ.38.36 కోట్ల లావాదేవీలు అక్రమంగా జరిగినట్లు గుర్తించాం’’ అని ఈడీ పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
-
India News
పరీక్షా హాలులో అమ్మాయిలను చూసి.. స్పృహ తప్పిపడిపోయిన ఇంటర్ విద్యార్థి
-
Ap-top-news News
Gudivada Amarnath: త్వరలో విశాఖ భవిష్యత్తు మారుతుంది: మంత్రి అమర్నాథ్
-
Ap-top-news News
Taraka Ratna: మెదడు సంబంధిత సమస్య మినహా తారకరత్న క్షేమం: విజయసాయిరెడ్డి
-
India News
బడ్జెట్ అంశాలు లీకవడంతో.. పదవిని కోల్పోయిన ఆర్థిక మంత్రి
-
Sports News
Hanuma Vihari: విహారి ఒంటి చేత్తో.. మణికట్టు విరిగినా బ్యాటింగ్