Telangana News: తెరాస ఎమ్మెల్యేను 9గంటల పాటు విచారించిన ఈడీ

ఈడీ కార్యాలయంలో తెరాస ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విచారణ ముగిసింది...

Updated : 27 Sep 2022 22:26 IST

హైదరాబాద్: ఈడీ కార్యాలయంలో తెరాస ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విచారణ ముగిసింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై ఇబ్రహీంపట్నం తెరాస ఎమ్మెల్యే మంచిరెడ్డిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ఆయనకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరైన ఎమ్మెల్యేను ఈడీ అధికారులు దాదాపు 9గంటల పాటు ప్రశ్నించి వివరాలు రాబట్టారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించినట్టు సమాచారం. మధ్యాహ్నం 12గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే  రాత్రి 9.30గంటలకు బయటకు వెళ్లారు. ఈడీ విచారణ ముగిసిన అనంతరం మీడియా కంట పడకుండా  జాగ్రత్తలు తీసుకున్నారు. ఈడీ కార్యాలయ సిబ్బంది సాయంతో వెనుక గేటు నుంచి బయటకు వచ్చిన మంచిరెడ్డి తన కారులో వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని