Rohith reddy: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఈడీ నన్ను ప్రశ్నించింది: పైలట్ రోహిత్‌రెడ్డి
ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని ఈడీ అధికారులు రెండో రోజు 7గంటల పాటు ప్రశ్నించారు. ఈడీ విచారణ అనంతరం ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు రోహిత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు తప్ప వేరే ఏమీ అడగలేదన్నారు.
హైదరాబాద్: తెరాస ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఈడీ విచారణ రెండో రోజు ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి దాదాపు 7గంటల పాటు ఎమ్మెల్యేను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ విచారణ అనంతరం రోహిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు తప్ప వేరే ఏమీ అడగలేదన్నారు. భాజపా కుట్రను బయటపెట్టిన ఘటన గురించి వివరించినట్లు తెలిపారు. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. ఫిర్యాదుదారుడిని అయిన నన్ను ప్రశ్నించటమేంటో అర్థం కాలేదని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తన వివరాలు, కుటుంబ వివరాలు ఈడీ అధికారులు అడిగినట్లు చెప్పారు. ఈ నెల 27న మరికొన్ని వివరాలతో మళ్లీ రమ్మన్నారని తెలిపారు. ఇదంతా భాజపా చేసిన కుట్ర అని రోహిత్‌రెడ్డి విమర్శించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న తనని ఈడీ అధికారులు రెండ్రోజులు ఇబ్బంది పెట్టినట్లు చెప్పారు. వివిధ కోణాల్లో చాలా ప్రశ్నలు అడిగినట్లు రోహిత్‌రెడ్డి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్