Hyderabad: వ్యక్తిగత డేటా చోరీ కేసు.. రంగంలోకి దిగిన ఈడీ అధికారులు
వ్యక్తిగత డేటా చోరీ కేసులో పోలీసు అధికారులు లోతుగా శోధిస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వ్యక్తిగత డేటా చోరీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు రంగంలోకి దిగారు. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 16.8కోట్ల మంది వ్యక్తిగత సమాచారం లీకైనట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. డేటా చౌర్యం చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. నిందితుల వద్ద రక్షణ రంగంతో పాటు.. బ్యాంకు, పాన్ కార్డు, డెబిట్, క్రెడిట్ కార్డుదారుల వ్యక్తిగత వివరాలున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్న క్రమంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
జస్ట్ డయల్ ద్వారా సమాచారాన్ని అమ్మకానికి పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పలు ఏజెన్సీల నుంచి ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు, మెయిల్ ఐడీ వంటి వివరాలు సేకరిస్తున్న ముఠా అంగట్లో అమ్మకానికి పెట్టినట్లు గుర్తించారు. రుణాలు ఇచ్చే సంస్థలు ఈ డేటాను అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. రక్షణ రంగానికి చెందిన అధికారుల ఫోన్ నెంబర్లు, వాళ్లు పనిచేసే ప్రాంతం, మెయిల్ ఐడీలు కూడా అమ్మకానికి పెట్టడంతో ఆర్మీ ఉన్నతాధికారులు సైతం సైబరాబాద్ పోలీసులతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. దేశ వ్యాప్తంగా డేటా చౌర్యం జరిగినట్లు తేలడంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న అధికారులు పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసుల నుంచి కేసుకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఈడీ అధికారులు సైతం నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Tirumala: ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే బ్రేక్ దర్శనాలు
-
Crime News
Khammam: దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్య!.. మంటల్లో కాలిపోతుండగా గుర్తింపు..
-
Sports News
Lionel Messi: చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
Ts-top-news News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమినరీకి.. 15 నిమిషాల ముందే గేట్ల మూసివేత
-
Politics News
Bandi Sanjay: తెదేపా, భాజపా పొత్తు వ్యవహారం.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ts-top-news News
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్డ్ కొంత కఠినమే..