Puri & Charmi: 12 గంటల పాటు .. పూరి జగన్నాథ్‌, చార్మిని ప్రశ్నించిన ఈడీ

ప్రముఖ దర్శకుడు, నిర్మాత పూరి జగన్నాథ్‌, నటి చార్మిని ఈడీ అధికారులు ఉదయం నుంచి విచారించారు. ఇటీవల విడుదలైన ఓ చిత్రానికి సంబంధించి పెట్టుబడుల వ్యవహారంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై ఇద్దరికీ వారం క్రితం నోటీసులు జారీ చేశారు. 

Updated : 17 Nov 2022 20:54 IST

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు, నిర్మాత పూరి జగన్నాథ్‌, నటి చార్మిని ఈడీ అధికారులు ఉదయం నుంచి విచారించారు. ఇటీవల విడుదలైన ఓ చిత్రానికి సంబంధించి పెట్టుబడుల వ్యవహారంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై ఇద్దరికీ వారం క్రితం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొనడంతో.. ఉదయం 8గంటలకు పూరి జగన్నాథ్‌, చార్మి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపు 12 గంటల పాటు విచారణ కొనసాగింది.  ఇటీవల విడుదలైన సినిమాకు సంబంధించిన వ్యవహారంలో దుబాయికి డబ్బులు పంపించి అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం కూడా ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని