Heera Gold: నేనెవ్వరినీ మోసం చేయలేదు: నౌహీరా షేక్‌

హీరా గోల్డ్‌ కుంభకోణం కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నౌహీరా షేక్‌కు ఈడీ మరోసారి విచారించింది. పెట్టుబడి దారులెవ్వరినీ మోసం చేయలేదని ఆమె మీడియకు తెలిపారు.

Updated : 27 Dec 2022 15:44 IST

హైదరాబాద్‌: హీరా గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన వారెవ్వరినీ మోసం చేయలేదని ఆ సంస్థ ఎండీ నౌహీరా షేక్‌ తెలిపారు. హీరా గోల్డ్‌ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమె.. విచారణ కోసం ఇవాళ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం బయటికి వస్తూ మీడియాతో మాట్లాడారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నానని చెప్పారు. డిపాజిటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ ప్రతి ఒక్కరి పెట్టుబడికి రెండింతలు చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇన్వెస్టర్ల డబ్బును న్యాయస్థానాల్లో ఇప్పటికే డీడీ రూపంలో డిపాజిట్‌ చేశాను. ఆస్తులు అమ్ముకునేందుకు సుప్రీం కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చింది. ఇప్పటి వరకు డిపాజిటర్లకు తిరిగి చెల్లించిన వివరాలను ఈడీకి సమర్పించాను. ఇకపైనా ఇన్వెస్టర్లతో కలిసి వ్యాపారం కొనసాగిస్తాను. రాజకీయ ఒత్తిళ్లతోనే నాపై అక్రమ కేసులు పెట్టారు. నేను రాజకీయ పార్టీని ప్రకటించిన మూడు రోజుల్లోనే అరెస్టు చేశారు.’’ అని నౌహీరా షేక్‌ అన్నారు. అరెస్టులకు భయపడబోనని చెప్పారు. హీరాగోల్డ్‌లో రూ.5వేల కోట్ల మేర మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై నౌహీరా షేక్‌ను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని