Mahipal Reddy: భారాస ఎమ్మెల్యే నివాసంలో ఈడీ సోదాలు

భారాసకు చెందిన పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు చేసింది. అతడి సోదరుడు మధుసూదన్‌రెడ్డి నివాసంలోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Published : 20 Jun 2024 09:18 IST

హైదరాబాద్‌: భారాసకు చెందిన పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు చేసింది. అతడి సోదరుడు మధుసూదన్‌రెడ్డి నివాసంలోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి పటాన్‌చెరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసు నేపథ్యంలోనే ఈడీ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు