విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వం: సురేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. సీఎం సూచనల మేరకు విద్యార్థు

Published : 17 Apr 2021 01:47 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. సీఎం సూచనల మేరకు విద్యార్థుల భవిష్యత్తు, భద్రతపై అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని