Tirumala: తిరుమల పాపవినాశనం రోడ్డులో బైకర్లను వెంబడించిన ఏనుగులు

తిరుమల పాపవినాశనం రహదారిలో ఏనుగులు హల్‌చల్‌ చేశాయి. నాలుగు రోజులుగా పాపవినాశనం రోడ్డులో తిష్ఠ వేసిన

Updated : 31 Mar 2022 11:04 IST

తిరుమల: తిరుమల పాపవినాశనం రహదారిలో ఏనుగులు హల్‌చల్‌ చేశాయి. నాలుగు రోజులుగా పాపవినాశనం రోడ్డులో తిష్ఠ వేసిన ఆకాశగంగ ప్రాంతంలో రహదారిపైకి వచ్చాయి. ఆ మార్గంలో వెళుతున్న ద్విచక్రవాహదారులపై ఏనుగులు దాడికి యత్నించడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొద్ది సేపు ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు తితిదే, అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

ఏనుగుల దాడిలో రైతు మృతి.. 

సదుం: ఏనుగుల దాడిలో రైతు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా సదుం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... జోగివారిపల్లె అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పంటపొలాలపై ఏనుగుల గుంపు దాడి చేశాయి. జోగివారిపల్లె పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు ఎల్లప్ప(38) తోట వద్ద నిద్రిస్తుండగా అతనిపై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో ఎల్లప్ప తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనాస్థలాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడద ఎక్కువవుతోంది. కొన్ని రోజులుగా మామిడి తోటలను ధ్వంసం చేయడంతో సహా పొలాల్లోని మోటార్లు, పాకలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు