Updated : 16 Nov 2020 01:33 IST

ఆయనకి ముత్యాలు.. ఇతనికి వాసనలు పడవు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలన్‌ మస్క్‌.. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ సీఈవో. నికోలా టెస్లా.. అల్టర్నేటింగ్‌ కరెంట్‌ (ఏసీ) ఎలక్ట్రిసిటీ సప్లై సిస్టమ్‌ డిజైన్‌ చేసిన శాస్త్రవేత్త. ఇతను ఓ ఎలక్ట్రానిక్‌ ఇంజినీర్‌. వీరిద్దరికీ ఎలాంటి సంబంధం లేదు. కేవలం నికోలా టెస్లా గౌరవార్థం మస్క్‌, మరికొందరు కలిసి స్థాపించిన మోటార్స్‌ సంస్థకు ఆయన పేరు పెట్టారు. అయితే, యాదృచ్ఛికంగా నికోలా టెస్లాకు.. టెస్లా కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌కు కొన్ని వింత ఫోబియాలు ఉన్నాయి. అవేంటంటే..

నికోలా టెస్లా సెర్బియన్‌ అమెరికన్‌. 1856 జులై 10న ఆస్ట్రియాలో జన్మించిన ఆయన.. ఇంజినీరింగ్‌లో చేరి పట్టా తీసుకోకుండానే టెలిఫోనీ, ఎలక్ట్రిక్‌ పవర్‌ ఇండస్ట్రీలో పనిచేశారు. ఆ తర్వాత అమెరికాకు వలసవెళ్లి అక్కడే స్థిరపడ్డారు. న్యూయార్క్‌లో ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థలను ఏర్పాటు చేశారు. అల్టర్నేటింగ్‌ కరెంట్‌ (ఏసీ) ఇండక్షన్‌ మోటార్‌ను కనుగొన్నారు. ఎలక్ట్రానిక్‌ రంగంలో విశేష కృషి చేశారు. అలాంటి వ్యక్తికి ఓ ఫోబియా ఉంది. ఆయనకు రత్నాలు, ముత్యాలు అంటే పడవు. అవి ఉన్న చోట కనీసం నిలబడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. మహిళలు ఎవరైనా ముత్యాల హారాలు వేసుకొని వస్తే వారితో మాట్లాడేందుకు కూడా నిరాకరించేవారట. ఒకసారి ఆయన సెక్రటరీ ముత్యాల హారం వేసుకొని విధుల్లోకి వస్తే, ఆమెకు ఆ రోజు సెలవు ప్రకటించి ఇంటికి పంపించారట. అయితే ఆయనకు ముత్యాలు, రత్నాలు అంటే ఎందుకు పడేవి కాదో.. ఎవరికీ తెలియదు.

ఇక ఎలన్‌ మస్క్‌ విషయానికొస్తే.. టెస్లా సంస్థను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టి పెరిగారు. ఆయన తల్లిది కెనడా. తండ్రిది దక్షిణాఫ్రికా. టెస్లాలాగానే మస్క్‌ కూడా ఒకసారి డిగ్రీలో చేరి మధ్యలోనే ఆపేశారు. 1989లో కెనడాలోని క్వీన్స్‌ యూనివర్సిటీలో చేరి డిగ్రీ తీసుకోకుండానే బయటకు వచ్చేశారు. ఆ తర్వాత పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌ అండ్  ఫిజిక్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. ప్రస్తుతం టెస్లాతో పాటూ స్పేస్‌ ఎక్స్‌ సంస్థను స్థాపించి ప్రైవేటుగా అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నారు. అయితే మస్క్‌ది సున్నితమైన ముక్కు. ఘాటు వాసనలు అస్సలు పడవు. ఘాటు వాసన పీల్చితే ఆయన ముక్కు బాగా నొప్పిపెడుతుందట. అందుకే సంస్థ సమావేశాల్లో పాల్గొనే వ్యక్తులకూ.. ఇంటర్వ్యూల కోసం ఆయన వద్దకు వెళ్లే వారికీ.. ఘాటు వాసన వచ్చే పర్‌ఫ్యూమ్స్‌ పూసుకొని వెళ్లొద్దని ముందే చెబుతుంటారట.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని