Andhra News: పోరస్‌ పరిశ్రమను తాత్కాలికంగా మూసేస్తున్నాం: కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌

ఏలూరు అగ్నిప్రమాద ఘటనపై కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ స్పందించారు. బాధితులకు చికిత్స సమయంలో కంపెనీ వేతనం అందిస్తుందని చెప్పారు.

Updated : 14 Apr 2022 12:15 IST

ఏలూరు: ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాద ఘటనపై కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ స్పందించారు. బాధితులకు చికిత్స సమయంలో కంపెనీ వేతనం అందిస్తుందని చెప్పారు. పోరస్‌ పరిశ్రమను తాత్కాలికంగా మూసేస్తున్నామని తెలిపారు. కంపెనీ నిబంధనలు ఉల్లంఘించిందా అనే అంశంపై విచారణ చేపట్టామని కలెక్టర్‌ వివరించారు. ప్రమాదకర రసాయనాలు వినియోగించారా అనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. హైప్రెజర్‌ వల్లే కెమికల్‌ రియాక్షన్‌ జరిగిందా అనే దానిపై పరిశీలన చేస్తున్నామన్నారు.

కంపెనీ నుంచి కూడా రూ.25లక్షల పరిహారం: ఎమ్మెల్యే ప్రతాప్‌

ఏలూరు ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ.25లక్షలు, కంపెనీ తరఫున రూ.25లక్షల పరిహారం అందుతుందన్నారు. క్షతగాత్రులకు వెంటనే రూ.లక్ష పరిహారం అందిస్తామని చెప్పారు. బాధితులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అగ్నిప్రమాద ఘటనపై విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. అంతకముందు ఎమ్మెల్యే ప్రతాప్‌ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని