Updated : 30 Jun 2022 16:35 IST

ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు ఏమయ్యాయంటే?..పిట్ట కథలు చెబుతున్నారు: సూర్యనారాయణ

అమరావతి: జీపీఎఫ్‌ ఖాతాల్లో డబ్బుల మాయంపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు సూర్యనారాయణ, ఆస్కార్‌ రావులు గురువారం సచివాలయంలో సీఎస్‌ సమీర్‌ శర్మను కలిశారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము డెబిట్ కావడంపై ప్రభుత్వ వివరణ కోరారు. సాంకేతిక కారణాలతోనే నగదు డెబిట్ అయినట్లు అధికారులు చెబుతున్నారని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ తెలిపారు. అధికారులు చెబుతున్న సమాధానంపై తాము సంతృప్తి చెందలేదని సీఎస్‌కు వివరించామని పేర్కొన్నారు. 

‘‘జీపీఎఫ్‌ ఖాతాల నుంచి డబ్బులు డెబిట్‌ అయ్యాయని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు గురవుతుంటే ఆర్థికశాఖ అధికారులు పిట్ట కథలు చెబుతున్నారు. అధికారులు చెబుతున్న మాటలను ఇతర ఉద్యోగ సంఘాల నేతలు నమ్మినట్లుగా మేము నమ్మట్లేదు. నగదు డెబిట్‌పై న్యాయపోరాటం చేస్తాం. సీఎస్‌, ఆర్థికశాఖ ఉద్యోగులు, సీఎఫ్‌ఎంఎస్, ప్రిన్సిపల్ అకౌటెంట్ జనరల్‌ను పార్టీగా చేరుస్తాం. అనుమతి లేకుండా మా ఖాతాల నుంచి డబ్బులు తీయడం నేరం. ప్రభుత్వం ఇచ్చిన వివరణ పూర్తిగా అవాస్తవం. డీఏ బకాయిల చెల్లింపుపై గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డీఏ బకాయిలతోనే జీతాలు పెరిగినట్లు గతంలో చెప్పారు. ఇప్పుడు డీఏ బకాయిలు వేయలేదంటున్నారు. ఏది నిజం?’’ అని సూర్యనారాయణ ప్రశ్నించారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని