Vizag: అగ్నిపథ్ తొలి బ్యాచ్‌కు 3,474 మంది అభ్యర్థులు: బిశ్వజిత్‌దాస్ గుప్తా
అగ్నిపథ్ తొలి బ్యాచ్ ఎంపికకు 3,474 మంది అభ్యర్థులు శిక్షణకు ఎంపికయ్యారని ఈఎన్‌సీ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్‌దాస్ గుప్తా తెలిపారు. ఇందులో 10శాతం మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని వెల్లడించారు.
విశాఖ: అగ్నిపథ్ తొలి బ్యాచ్ ఎంపికకు 3,474 మంది అభ్యర్థులు శిక్షణకు ఎంపికయ్యారని ఈఎన్‌సీ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్‌దాస్ గుప్తా తెలిపారు. ఇందులో 10శాతం మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని వెల్లడించారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అభ్యర్థుల శిక్షణ పూర్తయ్యాక తుది జాబితా ప్రకటిస్తామన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎంపికైన అభ్యర్థులంతా విధుల్లో చేరతారని వెల్లడించారు.
అండర్‌వాటర్ డొమైన్‌లో వ్యూహాత్మక విధానం అవలంభిస్తున్నామని.. ఇందులో మానవరహిత పరికరాలపైనా దృష్టి సారించామని తెలిపారు. అణు జలాంతర్గామి అరిహంత్ ఇప్పటికే సేవల్లో ఉందన్నారు. భవిష్యత్తులో మరో అణు జలాంతర్గామిని సమకూర్చుకుంటామని వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్ కింద 38 నౌకలు తయారీలో ఉన్నాయన్నారు. దక్షిణ శ్రీలంకలో చైనా పోర్టుపై సమీక్షిస్తున్నామని తెలిపారు. అనేక దేశాల్లో చైనా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తోందన్నారు. శ్రీలంకలోనూ అలాగే బేస్ ఏర్పాటు చేసుకుందని వివరించారు. మిలిటరీ ఎయిర్‌బేస్ కోసం విశాఖ విమానాశ్రయం నిర్మించారన్నారు. విశాఖ విమానాశ్రయానికి భోగాపురం ప్రత్యామ్నాయం కానుందని పేర్కొన్నారు. శ్రీలంకలో చైనా నిర్మించిన పోర్టుపై మన నిఘా ఉంటుందని వెల్లడించారు. నావికాదళంలో మహిళా సిబ్బంది సంఖ్య పెరుగుతోందని బిశ్వజిత్‌దాస్ చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా