Aanam Ramnarayan Reddy: త్వరలోనే ఆలయాలకు కొత్త పాలకమండళ్లు: మంత్రి ఆనం

రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర అంశాలపై సమీక్ష చేస్తున్నట్లు ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు.

Published : 10 Jul 2024 15:46 IST

అమరావతి: రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర అంశాలపై సమీక్ష చేస్తున్నట్లు ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని కుటుంబసమేతంగా ఆయన దర్శించుకున్నారు. ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. త్వరలోనే అన్ని ఆలయాలకు కొత్త పాలకమండళ్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

‘‘ప్రభుత్వం మారిన తర్వాత అప్పటి వరకు కొనసాగిన పాలకమండళ్ల సభ్యులు తమ పదవీకాలంతో సంబంధం లేకుండా రాజీనామాలు చేయడం నైతిక విలువలు పాటించడం అవుతుంది. లేని పక్షంలో ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే సీఎం చంద్రబాబు దేవాదాయశాఖపై సమీక్ష చేస్తారు. ఆయన సూచనల మేరకు ముందడుగు వేస్తాం. కొత్త పాలకమండళ్లను నియమిస్తాం. హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరినీ గౌరవించడం మన సంప్రదాయం. ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం తగిన చర్యలు తీసుకుంటున్నాం’’అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని