Andhra News: ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. మే15 నుంచి ఏపీఈఏపీసెట్‌

ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్‌-2023 పరీక్ష తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.

Updated : 08 Mar 2023 18:43 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది.  ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్‌-2023 పరీక్ష తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మే 15 నుంచి 18 వరకు ఇంజినీరింగ్‌.. మే 22, 23 తేదీల్లో ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈఏపీసెట్‌ దరఖాస్తుకు ఈనెల 11 నుంచి వచ్చే నెల 15 వరకు గడువు ఇచ్చింది. అలాగే మే 5న ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈసెట్‌) నిర్వహించనుండగా.. దరఖాస్తుకు మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 10 వరకు అవకాశం కల్పించింది. మే 24, 25న ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్ టెస్ట్‌ (ఐసెట్‌) పరీక్షలు జరపగా.. దరఖాస్తుకు ఈనెల 20 నుంచి ఏప్రిల్‌ 19 వరకు గడువు ఇచ్చింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని