Eamcet exam: తెలంగాణలో మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్ష

తెలంగాణలో మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. 7 నుంచి 11 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌,  12 నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్ష జరగనుంది. 

Updated : 07 Feb 2023 17:27 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌(TS Eamcet 2023) పరీక్ష నిర్వహించనున్నారు. 7 నుంచి 11 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌,  12 నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్ష జరగనుంది. మే 18న (TS Edcet) ఎడ్‌సెట్‌, మే 20న (TS Ecet) ఈసెట్‌, మే 25న (TS LAWCET)లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌,  మే 26, 27న (TS ICET) ఐసెట్‌, మే 29 నుంచి జూన్‌1 వరకు (TSPGECET)పీజీఈసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని