TS News: ఐఐటీ రామయ్యకు మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు

ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాద్‌ విద్యానగర్‌లోని

Updated : 20 Nov 2021 16:43 IST

హైదరాబాద్‌: ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాద్‌ విద్యానగర్‌లోని రామయ్య నివాసానికి వెళ్లిన మంత్రి.. ఆయన్ను శాలువాతో సత్కరించి మిఠాయి బాక్సు అందించారు.  ఈ సందర్భంగా దేశంలో, రాష్ట్రంలోని సమకాలీన పరిస్థితులపై రామయ్యతో కాసేపు చర్చించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో జన్మించిన రామయ్య.. హైదరాబాద్‌ సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడారని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అధ్యాపకుడిగా పదవీ విరమణ చేసిన ఆయన ఐఐటీ రామయ్యగా పేర్గాంచారన్నారు. చిన్నారులు, పెద్దల కోసం అనేక రచనలు చేసిన రామయ్య ఆయురారోగ్యాలతో జీవించాలని ఎర్రబెల్లి ఆకాంక్షించారు.

ఇంటి ఆవరణలో మొక్కలు నాటిన రామయ్య

తన పుట్టిన రోజును పురస్కరించుకొని రామయ్య తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలునాటి హరిత స్ఫూర్తిని చాటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని