Updated : 28 May 2021 17:14 IST

Top Ten News @ 5 PM

1. Ap News: అధిక ఫీజు వసూలు చేస్తే క్రిమినల్‌ కేసులే!

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రైవేటు ఆస్పత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పలు ఆస్పత్రులు కనీస మానవత్వం మరిచి కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా బాధితుల నుంచి డబ్బులు అధికంగా వసూలు చేస్తే పది రెట్ల పెనాల్టీ విధించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* Corona: ఏపీలో కేసులు తగ్గుతున్నాయ్‌..!

2. Vote For Note: తెలంగాణ ఏసీబీకి సుప్రీం నోటీసులు

సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌పై ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్‌రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయ్యేవరకు సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిలిపివేయాలని జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత ధర్మాసనం తెలంగాణ ఏసీబీని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* Raghurama అరెస్టుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

3. Krishnapatnam:ఆ ప్రచారం నమ్మొద్దు: ఆనందయ్య

కరోనా నివారణ కోసం తాను పంపిణీ చేస్తున్న ఔషధానికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రాలేదని ఆనందయ్య స్పష్టంచేశారు. శుక్రవారం మందు పంపిణీ చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలు అవాస్తవమన్నారు. ఔషధ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు సిద్ధంగా లేవని చెప్పారు. వదంతులు నమ్మి ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. CBN: రివర్స్‌ టెండరింగ్‌తో ఆలస్యం: చంద్రబాబు

రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల పనులన్నీ ఆలస్యమవుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో అయోమయంగా ఉందని చెప్పారు. డిజిటల్‌ మహానాడు రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా చంద్రబాబు మాట్లాడారు. తమ హయాంలో పులివెందులకు నీళ్లు ఇచ్చి చీనీ చెట్లను కాపాడామని.. రాయలసీమలో కరవు ఉండకూడదని చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. కుమార్తెను ప్రేమించాడని..ముక్కలుగా నరికాడు

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో దారుణం చోటుచేసుకుంది. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన ధనశేఖర్‌ (23) అనే యువకుడు హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. పెంగరగుంటకు చెందిన ఓ బాలికను ధనశేఖర్‌ రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్న ధనశేఖర్ మృతదేహం సొంత పొలంలోనే కనిపించడంతో యువకుడి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. DRDO: 2-డీజీ ధర ఎంతంటే..?

కరోనా బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన 2-డీజీ(2-డియాక్సీ - డి- గ్లూకోజ్‌) ఔషధం ధర ఖరారైంది. పొడి రూపంలో ఉండే ఈ ఔషధం ఒక్కో సాచెట్‌ ధర రూ. 990గా డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. యితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం ఫార్మా కంపెనీ డిస్కౌంట్‌ ధరకు అందజేయనున్నట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌..మ‌రింత సుల‌భంగా ఐటీఆర్‌ 

ప‌న్ను చెల్లింపుదారుల‌కు మెరుగైన సేవ‌ల‌ను అందించేందుకు ఆదాయ‌పు ప‌న్ను(ఐటీ) శాఖ కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.  ఈ కొత్త పోర్ట‌ల్ www.incometax.gov.in జూన్ 7, 2021 నుంచి అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఆశాఖ తెలిపింది. కొత్త ఇ- పోర్ట‌ల్ స‌హాయంతో మ‌రింత సులువుగా, సౌక‌ర్య‌వంతంగా ప‌న్ను చెల్లింపుదారులు త‌మ రిట‌ర్నుల ప్ర‌క్రియ‌ను పూర్తిచేయ‌గ‌లుగుతార‌ని ఐటీ శాఖ విశ్వాసం వ్య‌క్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. 5G Network: 5జీ ట్రయల్స్‌కు స్పెక్ట్రమ్‌ కేటాయింపు

దేశంలో 5జీ సేవలకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఇటీవలే 5జీ ట్రయల్స్‌కు అనుమతిచ్చిన టెలికాం విభాగం (డాట్‌).. తాజాగా అందుకు సంబంధించిన స్పెక్ట్రమ్‌ను టెలికాం సంస్థలకు కేటాయించింది. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, గుజరాత్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. Gates Divorce: ఫౌండేషన్‌ నిర్వహణలో కొత్త ట్విస్టు!

దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకుల కోసం బిల్‌గేట్స్‌ - మెలిందా దంపతులు కోర్టు మెట్లు ఎక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినా..  బిల్‌-మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ను ఇరువురం కలిసే కొనసాగిస్తామని ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, వాల్‌ స్ట్రీట్ జర్నల్‌ ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. ఫౌండేషన్‌ నిర్మాణంలో కొన్ని మార్పులు తేవాలని బిల్‌, మెలిందా భావిస్తున్నరట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. WTC Finals: ఆరో రోజు నిబంధనలు ఇవే!

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిఫ్‌ ఫైనల్స్‌ నిబంధనలను ఐసీసీ ప్రకటించింది. ఐదు రోజుల్లో ఫలితం తేలకుండా మ్యాచ్‌ డ్రా అయితే రెండు జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తామని వెల్లడించింది. నిర్ణీత కాల వ్యవధిలో మ్యాచ్‌ పూర్తవ్వకపోతే, అడ్డంకులు ఎదురైతేనే నష్టపోయిన ఆటను ఆరో రోజు ఆడిస్తామని స్పష్టం చేసింది. షార్ట్‌ రన్‌ వంటి విషయాలను మూడో అంపైర్‌ చూసుకుంటారని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని