- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
ఏపీలో పరిషత్ ఎన్నికలకు కసరత్తు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఎస్‌ఈసీగా ఇవాళ ఉదయం బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని పరిషత్ ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు నిర్ణయించారు. ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యదర్శి కన్నబాబుతో దీనిపై సమీక్షించారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌తో ఎస్‌ఈసీ కార్యాలయంలో నీలం సాహ్ని భేటీ అయి ఎన్నికల నిర్వహణపై చర్చించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఇవాళ సాయంత్రం 4గంటలకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎస్, డీజీపీ పాల్గొని ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. సమావేశం అనంతరం ఎస్‌ఈసీ ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశముంది. పరిషత్ ఎన్నికలకు గతేడాది మార్చి 7న నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొవిడ్ ఉగ్రరూపం దాల్చింది. దీంతో మార్చి 15వ తేదీన అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పరిషత్ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న ఎన్నికలను తిరిగి కొనసాగించాలని నీలం సాహ్ని నిర్ణయించారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తూ సాయంత్రం ప్రకటన విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
T20 Cricket : టీ20ల్లో టాప్ స్కోరర్.. మళ్లీ రోహిత్‌ను అధిగమించిన కివీస్ ఓపెనర్
-
India News
Mukesh Ambani: ముకేశ్ అంబానీకి బెదిరింపులు.. రెండు గంటల్లో 8ఫోన్ కాల్స్!
-
Crime News
Crime News: బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు హైదరాబాద్ వాసులు మృతి
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Viral-videos News
Viral video: భారత జాతీయ గీతం ‘జనగణమన’ వినిపించిన పాకిస్థానీ మ్యుజీషియన్
-
Crime News
Guntur: ప్రత్తిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
- Flight: గర్ల్‌ఫ్రెండ్‌తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Indraja: నాకు అమ్మాయి పుట్టేదాకా.. పెళ్లి విషయం ఎవరికీ తెలియదు: ఇంద్రజ
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Tirumala: 50మంది అనుచరులకు శ్రీవారి బ్రేక్ దర్శనం.. ఏపీ మంత్రిపై విమర్శలు
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Jio Phone 5G: జియో 5జీ ఫోన్.. ధర, ఫీచర్లు, విడుదల తేదీ వివరాలివే!