Exercise: వ్యాయామంతో మానసిక ఆరోగ్యం

వ్యాయామం చేయడమంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమేనని వైద్యులు చెబుతున్నారు. శారీరకంగా దృఢంగా ఉండటానికి వ్యాయామం ఎంతో దోహదపడుతుంది. గుండె, కిడ్నీ, కాలేయం సమర్థంగా పని చేయాలంటే నడక, వ్యాయామం ఎంతో ముఖ్యమని పేర్కొంటున్నారు. 

Published : 22 May 2022 01:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యాయామం చేయడమంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమేనని వైద్యులు చెబుతున్నారు. శారీరకంగా దృఢంగా ఉండటానికి వ్యాయామం ఎంతో దోహదపడుతుంది. గుండె, కిడ్నీ, కాలేయం సమర్థంగా పని చేయాలంటే నడక, వ్యాయామం ఎంతో ముఖ్యమని పేర్కొంటున్నారు. ఇపుడు కొత్తగా మానసిక ఆరోగ్యానికి కూడా వ్యాయామం ఎంతో ఉపకరిస్తుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.

🏃 నడక, వ్యాయామం, యోగా లాంటివి మానసిక రుగ్మతలను దూరం చేయడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయని నిపుణులు వివరిస్తున్నారు.

🏃 శారీరక వ్యాయామాలైన నడక, పరుగు, వ్యాయామం చేసే వారికి మానసిక రుగ్మతలు దరి చేరే అవకాశాలు చాలా తక్కువని స్వీడన్‌ పరిశోధకులు చెబుతున్నారు.

🏃  మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్న వారికి 12 వారాల పాటు ఏరోబిక్స్‌, స్ట్రెంత్‌ట్రైనింగ్‌ కార్యక్రమాలను నిర్వహించారు.

🏃 రోజుకు గంట గానీ వారానికి కనీసం మూడుసార్లు ఈ శిక్షణలో పాల్గొన్న 75 శాతం మంది గుండె స్పందనలను పరిశీలించినపుడు గుండె స్పందనలు సాధారణంగా ఉన్నాయి.  ఆందోళన స్థాయి బాగా తగ్గినట్టు గుర్తించారు. 

🏃 అమెరికాలో చేసిన మరో అధ్యయనంలో ఇవే ఫలితాలు వచ్చాయి. కార్యాలయాలు, ఇళ్లలో, ఒకే చోట పరిమితమయిన వారిలో మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. 

🏃 ఇలాంటి వారు ఒకచోట నుంచి మరోచోటకు వెళ్లడం, నిత్యం కొంతసేపైనా నడవడం, తేలికపాటి వ్యాయామం చేయడంతో మానసిక సమస్యలు తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

🏃 వ్యాయామం చేయడంతో మెదడులో ఎండార్పిన్‌ విడుదల కావడంతో బావోద్వేగాలపై నియంత్రణ ఏర్పడుతుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని