Hyderabad: గీత కార్మికులకు రూ.12.50లక్షల ఎక్స్‌గ్రేషియా విడుదల: మంత్రి శ్రీనివాస్ గౌడ్
రాష్ట్రంలోని గీత కార్మికులకు రూ.12.50లక్షల ఎక్స్‌గ్రేషియాను విడుదల చేసినట్లు ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
హైదరాబాద్: రాష్ట్రంలోని గీత కార్మికులకు రూ.12.50లక్షల ఎక్స్‌గ్రేషియాను విడుదల చేసినట్లు ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో 5ఎకరాలలో నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవన నిర్మాణానికి జరిగే భూమి పూజ కార్యక్రమంలో గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియాను పంపిణీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
ప్రమాదవశాత్తు తాటి, ఈత చెట్లపై నుంచి పడి మరణించిన, శాశ్వత అంగవైకల్యం చెందిన గీత కార్మికులకు ఈ ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు తెలిపారు. రైతు బీమా మాదిరిగా నేరుగా కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని చెప్పారు. గీత కార్మికులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, లైసెన్స్, నామినీ వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారులకు అందజేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గీత కార్మికులు వారికి సమీపంలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్‌లో వివరాలను వారం రోజుల్లో అందజేయాలన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారుల వద్ద వివరాలు నమోదు చేసుకోని గీత కార్మికులకు బీమా అందించడం వీలుకాదని స్పష్టం చేశారు. గీత కార్మికుల బీమా రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు అయ్యేలా విధివిధానాలు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కేబినెట్ ఆమోదం పొందాకే అమల్లోకి సీమెన్స్ ప్రాజెక్టు: చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు
-
ODI WC 2023: అశ్విన్ ఎంపికపై భజ్జీ కామెంట్లు.. నెట్టింట మరోసారి సంజూ వైరల్!
-
Lalu Prasad Yadav: భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట
-
Supreme Court: ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
CISF constable: దిల్లీలో చీపురుపల్లి కానిస్టేబుల్ ఆత్మహత్య
-
Galaxy S23 FE: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ విడుదల.. 50MP కెమెరా, 4,500 బ్యాటరీ