Published : 20 Mar 2022 13:53 IST

Andhra news: రాష్ట్రంలో పెరిగిన ఎగుమతులు.. ఆక్వా ఉత్పత్తులే కీలకం..!

అమరావతి: రాష్ట్రంలో ఎగుమతులు వృద్ధి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల విలువ రూ.1.24 లక్షల కోట్లుగా ఉన్నట్టు పరిశ్రమల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మునుపటి ఏడాదితో పోలిస్తే 2 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు పెరిగినట్టు ఆ శాఖ స్పష్టం చేసింది. 2019-20లో దాదాపు రూ.1.04 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసినట్టు పేర్కొంది. ప్రస్తుతం దేశం నుంచి జరుగుతున్న మొత్తం ఎగుమతుల్లో ఏపీ వాటా 5.8 శాతంగా ఉన్నట్టు కోల్‌కతా కేంద్రంగా ఉన్న డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ కమర్షియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌(డీజీసీఐఎస్‌) నివేదికలో వెల్లడైంది. ఎగుమతుల్లో ఆక్వా ఉత్పత్తులు కీలక పాత్ర పోషించినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మెరైన్‌ ఉత్పత్తుల ఎగుమతులను మరింతగా మెరుగుపరిచేందుకు ఫిషింగ్‌ హార్బర్ల నుంచి ప్రాసెసింగ్‌ సదుపాయాలను పెంచనున్నట్టు తెలిపింది. మరిన్ని ఫిషింగ్‌ హార్బర్లను నిర్మించడం ద్వారా 4.5 మిలియన్‌ టన్నుల ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు వీలుగా కార్యచరణ సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని