AP News: ఏపీ సచివాలయ ఉద్యోగులకు ఉచిత గృహవసతి గడువు పొడిగింపు

ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహవసతి సౌకర్యాన్ని పొడిగించేందకు సీఎం జగన్‌ ఆమోదం తెలిపినట్టు సచివాలయ

Published : 16 Oct 2021 02:27 IST

అమరావతి: ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత గృహవసతి సౌకర్యాన్ని పొడిగించేందకు సీఎం జగన్‌ ఆమోదం తెలిపినట్టు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ నుంచి పూర్తిగా తరలిరాని ఉద్యోగుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత వసతిని 2022 ఏప్రిల్‌ వరకు (ఆరు నెలలపాటు) పొడిగించాలని సీఎం జగన్‌ ఆదేశించినట్టు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సంబంధిత అధికారులు సమాచారం పంపినట్టు వెల్లడించారు. ఈనెలాఖరుతో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత వసతి గడువు ముగుస్తుండటంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ విజ్ఞప్తి మేరకు సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెంకట్రామిరెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని