Puneeth Rajkumar: జిమ్‌లో వ్యాయామం.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వ్యాయామం చేసేవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కసరత్తులు చేసే సమయంలో డీహైడ్రేషన్‌కు గురైనా.....

Published : 30 Oct 2021 01:09 IST

ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కుల్దీప్‌ శెట్టితో ముఖాముఖి- వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యాయామం చేసేవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కసరత్తులు చేసే సమయంలో డీహైడ్రేషన్‌కు గురైనా, హైబీపీ, లో-బీపీ లేదంటే విపరీతమైన చెమట వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. వ్యాయామం చేస్తూ కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఈరోజు మధ్యాహ్నం మృతిచెందడం పట్ల ప్రతిఒక్కరూ దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాయామంపై సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీ వరకు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిమ్‌లో లేదా ఇంటి వద్ద వ్యాయామాలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ప్రముఖ సినీతారలకు ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ ఇచ్చే కుల్దీప్‌ శెట్టితో ‘ఈటీవీ’ ప్రతినిధి ముఖాముఖి నిర్వహించారు. ఆ వివరాలు వీడియోలో..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని