చైనా ఖాతాలు తొలగించిన ఫేస్‌బుక్‌

నకిలీ ఖాతాలు, ఫేస్‌బుక్‌ పేజీలు ఉన్న చైనాకు చెందిన నెట్‌వర్క్‌ను ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ తొలగించింది. అమెరికా సహా ఇతర దేశాల్లోని రాజకీయ కార్యకలాపాలను ఇబ్బందిపరిచేలా ఈ ఖాతాలు ఉన్నాయని ఫేస్‌బుక్‌ వెల్లడించింది

Published : 24 Sep 2020 00:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నకిలీ ఖాతాలు, ఫేస్‌బుక్‌ పేజీలు ఉన్న చైనాకు చెందిన నెట్‌వర్క్‌ను ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ తొలగించింది. అమెరికా సహా ఇతర దేశాల్లోని రాజకీయ కార్యకలాపాలను ఇబ్బందిపరిచేలా ఈ ఖాతాలు ఉన్నాయని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. ఆగ్నేయాసియా, ఫిలిప్పీన్స్‌ దేశాల రాజకీయాలపైనే ప్రధానంగా ఈ నెట్‌వర్క్‌ దృష్టి సారించినట్లు తెలిపింది. 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాట్ల అభ్యర్థి జోబైడెన్‌లకు వ్యతిరేకంగా, మద్దతుగా ఈ ఖాతాల్లో పోస్టులు చేసినట్లు పేర్కొంది. చైనా ప్రభుత్వంతో ఈ నెట్‌వర్క్‌కు సంబంధాలు ఉన్నాయా లేదా అనే విషయం ఫేస్‌బుక్‌ వెల్లడించలేదు. ప్రైవేటు నెట్‌వర్క్‌లు, ఇతర పద్ధతుల ద్వారా ఈ ఖాతాలను నిర్వహించిన వ్యక్తులు తమ వివరాలను దాచినట్లు తెలిపింది. మరోవైపు విదేశాలకు చెందిన వ్యక్తులు, సైబర్‌ నేరగాళ్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేందుకు, ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఎఫ్‌బీఐ సహా హోంలైన్‌ సెక్యూరిటీస్‌ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని