Diet tips: ఆరోగ్యకర జీవనానికి మార్గాలివిగో.. !

ఇదేంటీ తినండి ఫిట్‌గా ఉండండి అంటున్నారు అనుకోకండి. ఫిట్‌గా ఉండలి అనేది అందరి ఆకాంక్ష. అందుకోసం చేసే పనుల్లో ప్రధానమైనది ఆహారాన్ని అదుపులో ఉంచుకోవడం.

Published : 24 Apr 2022 15:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇదేంటి?‘తినండి.. ఫిట్‌గా ఉండండి’ అంటున్నారు అనుకోకండి. ఫిట్‌గా ఉండాలనేది అందరి ఆకాంక్ష. అందుకోసం చేసే పనుల్లో ప్రధానమైనది ఆహారం తీసుకోవడం నియంత్రణ. స్థిరమైన, ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవాలనే కుతూహలంతో మీ కోరికలు అణచుకోవాల్సి ఉంటుంది. దీంతో మీకు ఇష్టమైన ఆహారానికి దూరమైపోతున్నారన్న అభద్రతా భావంతో ఒత్తిడి, హార్మోనల అసమతుల్యత వంటి సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. డైట్ ప్లాన్‌ను ప్రారంభించడమే కష్టమైన దారి అనుకుంటారు కొందరు. కానీ, దానిని కొనసాగించడం కూడా కష్టమే. మీ నిర్ణయానికి కట్టుబడి ఉండలన్న దృఢ సంకల్పం మీకుంటే ఎన్ని సమస్యలనైనా అధిగమించవచ్చు. మీరు అలా కట్టుబడి ఉండటానికి ఆరోగ్య నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతారు. వీటిని పాటిస్తే మీరు తినాలనే కోరికను అణచుకోవాల్సిన అవసరం లేదు. మీ డైట్‌ను నిస్సంకోచంగా ప్రారంభించవచ్చు. అవేంటో చుద్దామా!

1. మీ శరీరాన్ని గమనిస్తూ ఉండండి

మీరు మీ శరీరాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. శరీరంలో జరిగే జీవక్రియలు.. ఎప్పుడు ఆహారం తినాలనే సంకేతాలు మీకే కనపడతాయి. ఎంత మొత్తంలో ఆహారం తీసుకోవాలి? ఏ ఆహారం తీసుకుంటే ఆకలి తీరుతుంది వంటి వాటిపై అవగాహన పెంచుకోండి. పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకుని అసంతృప్తి చెందకండి. చాలా మంది వారంలో 25 కిలోలు తగ్గిపోవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం శరీరాన్ని కష్టపెడతారు. దీనివల్ల అనేక సమస్యల బారిన పడుతుంటారు. అలా కాకుండా సాధ్యమైన, సాధించగలిగిన లక్ష్యాలను పెట్టుకుంటే అవి చేరుకున్నప్పుడు పొందే ఆనందం, మిగతా లక్ష్యాలను ప్రేరేపిస్తుంది.

2.నిపుణులను కలవండి
నిపుణుల సలహాలను తీసుకోవడం వల్ల మీ శరీరానికి తగిన పోషకాలు అందుతాయి. ఏ రకమైన పదార్థాలు తింటే మీరు డైట్ సమస్యల నుంచి బయటపడతారో వారు వివరిస్తారు. చాలా మందిలో ఉండే ప్రశ్న తమ చేతుల్లో ఉన్న ఆహారం మంచిదా కాదా.. డైట్‌లో వారు తినొచ్చ లేదా..? అనేది. దీనిని అధిగమించడానికి నిపుణులు సహాయం చేస్తారు.

3. మీ కిరాణా జాబితాను పునఃపరిశీలించండి

ఎందుకంటే మీరు అనారోగ్యకరమైన సరకులను కొనకపోతే. వాటిని తినలేదు. దానివల్ల డైట్‌ను కొనసాగించడానికి వీలుంటుంది. రోజు వారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలతో పాటు, డ్రైఫ్రూట్స్‌ను కూడా చేర్చుకోండి. దీనివల్ల  తక్కువ తిన్న ఎక్కువ శక్తి దొరుకుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని