Cancer treatment: క్యాన్సర్‌ చికిత్స తర్వాత ఏం చేయాలి..?

క్యాన్సర్‌ అంటేనే ప్రాణాంతకమని భయపడుతాం. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా రకాల క్యాన్సర్లకు చికిత్స చేస్తున్నారు. చాలా మంది చికిత్స విజయవంతం అయ్యింది.

Published : 07 Jul 2022 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్యాన్సర్‌ అంటేనే ప్రాణాంతకమని భయపడుతాం. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా రకాల క్యాన్సర్లకు చికిత్స చేస్తున్నారు. అయితే.. చాలా మంది చికిత్స విజయవంతం అయ్యింది.. ఇక ఆసుపత్రికి ఎందుకు..? అనే భావనతో ఉంటారు. కానీ ఇది నిజం కాదు.. క్యాన్సర్‌ చికిత్సలో ఇచ్చే కీమో థెరపీ, రేడియేషన్‌తో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇవి చికిత్స తర్వాత నెల, రెండు నెలలకు కూడా బయట పడొచ్చు. అందుకే కొంతకాలం పాటు ఆరోగ్యంగా ఉన్నా.. చికిత్స అనుశీలన ప్రక్రియను పూర్తిగా కొనసాగించాలని హెడ్‌, నెక్‌ ఆంకో సర్జరీ-లేజర్‌ సర్జరీ డాక్టర్‌ భార్గవ్‌ పేర్కొన్నారు.

క్యాన్సర్‌ చికిత్స తర్వాత..

సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీలు క్యాన్సర్‌ నయం చేయడానికి వినియోగించిన తర్వాత ఒక్కో దానికి ఒక్కో విధంగా సైడ్‌ ఎఫెక్టులుంటాయి. ఏ అవయవానికి చికిత్స చేస్తారో దానికి సంబంధించి ఆరు నెలల నుంచి రెండేళ్ల దాకా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వైద్యులను తరచుగా సంప్రదించినట్లయితే వచ్చిన సమస్యలను తొలగించడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో క్యాన్సర్‌ బేసిక్‌ పరీక్షలు తప్ప పెద్దగా ఏ పరీక్షలు అవసరం ఉండదు. మందులు కూడా వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు.

జాగ్రత్తలిలా తీసుకోవాలి

* క్యాన్సర్‌ చికిత్స తర్వాత గతంలో ఉన్న అలవాట్లు మానుకోవాలి. గుట్కా, సిగరేట్లు, మద్యం, మాదకద్రవ్యాలు పూర్తిగా వదిలేయాలి.

* ఆహార నియమాలను పాటించాలి. అన్ని రకాల ఆకు, కాయగూరలు తిన్నట్లయితే క్యాన్సర్‌ రాకుండా ఆపుతాయి. హై ప్రోటిన్‌ ఉన్న  ఆహారం తీసుకోవాలి.

* శస్త్రచికిత్స తర్వాత రెండు నెలలకోసారి వైద్యులను కలుసుకోవాలి. క్యాన్సర్‌ తీరుతెన్నులు, కొత్తగా ఎక్కడయినా క్యాన్సర్‌ ఆనవాళ్లు ఉన్నాయో పరిశీలించాలి. రెండో ఏడాది మూడు నెలలకోసారి, మూడో ఏడాదికి రెండుసార్లు పరీక్షలు చేయించుకుంటే చాలు. ఇలా ఐదేళ్ల పాటు అనుశీలన చేయాలి.

* చికిత్స తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేనట్లయితే సాధారణ జీవనం గడపొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని