Published : 30 Apr 2022 15:29 IST

Telangana News: కుమారుడి హత్య.. న్యాయం చేయాలంటూ ప్రగతిభవన్‌కు చేరుకున్న కుటుంబం

హైదరాబాద్‌: కుమారుడి హత్య విషయంలో నేరస్థులకు శిక్ష పడేలా తమకు న్యాయం చేయాలంటూ.. ఓ కుటుంబం ప్రగతిభవన్‌కు చేరుకునేందుకు యత్నించింది. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన రాము, లక్ష్మి దంపతుల కుమారుడు గతేడాది చనిపోయాడు. కొంతమంది తమ బిడ్డను హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 8 నెలలుగా తిరుగుతున్నా పోలీసులు తమ విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదంటూ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేరుగా ముఖ్యమంత్రిని కలిసి విన్నవించుకోవడానికి ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. తమ గోడు వెళ్లబోసుకునేందుకు వస్తే.. పోలీసులు తమను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారని ఆ దంపతులు వాపోయారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని