Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
ప్రపంచంలోనే అతి తక్కువ ప్రయాణ సమయం గల విమానంలో ప్రయాణించానని, ఈ సమయం కేవలం ఒక నిమిషం 14 సెకన్లు మాత్రమేనని బ్రిటన్ను చెందిన ఓ ట్రావెల్ బ్లాగర్ వెల్లడించాడు........
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ను చెందిన ఓ ట్రావెల్ బ్లాగర్ పంచుకున్న వీడియో ఆకట్టుకుంటోంది. తాను ప్రపంచంలోనే అతి తక్కువ ప్రయాణ సమయం గల విమానంలో ప్రయాణించానని, ఈ సమయం కేవలం ఒక నిమిషం 14 సెకన్లు మాత్రమేనని వెల్లడించాడు. స్కాట్లాండ్లోని పపా వెస్ట్రే, వెస్ట్రే ద్వీపాల మధ్య ఈ ప్రయాణం సాగినట్లు బ్లాగర్ నియోల్ ఫిలిప్ (41) తెలుపుతూ, ఇందుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశాడు.
‘నేను ప్రపంచంలోనే అత్యంత తక్కువ ప్రయాణ సమయం గల విమానంలో ప్రయాణించి, ఒక మారుమూల స్కాటిష్ ద్వీపంలో రాత్రంతా గడిపాను’ అంటూ ఫిలిప్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. తాను ప్రయాణించిన రెండు ద్వీపాల మధ్య దూరం 1.7 మైళ్లు (2.7 కిలోమీటర్లు) అని తెలిపాడు. అయితే ఇది చాలా తక్కువ దూరమే అయినప్పటికీ ఈ జర్నీకి 17 పౌండ్లు (రూ.1645) తీసుకున్నారని.. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఎక్కవ వసూలు చేసే విమానాల్లో ఇదీ ఒకటని వెల్లడించాడు.
ఈ విమానంలో ప్రయాణిస్తే 1.14 నిమిషాలు పట్టిందని.. అదే పడవలో వెళితే దాదాపు 20 నిమిషాలు పడుతుందని పేర్కొన్నాడు. ఫిలిప్ పంచుకున్న ఈ వీడియోను ఇప్పటివరకు 1.8 లక్షల మంది వీక్షించారు. అయితే ఈ జర్నీపై కొందరు సరదాగా స్పందిస్తున్నారు. ఒకవేళ విమానం గంటపాటు ఆలస్యంగా ఉంటే, నడుచుకుంటూనో, లేదా సముద్రంలో ఈదుకుంటూనో గమ్యస్థానానికి వెళ్లిపోవచ్చని సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. గమ్యస్థానమైన వెస్ట్రే పేరును వీడియోలో బ్లాగర్ పదేపదే పలకడంపై ట్రోల్స్ ఎదుర్కొటున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
TS High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. ఈమేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.