Telangana News: నిమ్జ్‌ కోసం బలవంతపు భూసేకరణ.. రైతు బిడ్డ ఆవేదన

జాతీయ పెట్టుబడులు ఉత్పత్తుల మండలి (నిమ్జ్‌) కోసం భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నారు. అధికారులు ప్రకటించిన పరిహారం తమకు సరిపోదని పేర్కొంటున్నారు

Updated : 06 Jul 2022 20:07 IST

హైదరాబాద్‌: జాతీయ పెట్టుబడులు ఉత్పత్తుల మండలి (నిమ్జ్‌) కోసం భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నారు. అధికారులు ప్రకటించిన పరిహారం తమకు సరిపోదని పేర్కొంటున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.9 లక్షలకు మించి రాదని, ఆ డబ్బుతో తమ చుట్టుపక్కల కనీసం 100 గజాల స్థలం కూడా కొనుగోలు చేయలేమని అంటున్నారు. దీంతో భూసేకరణ కోసం గ్రామాల్లోకి వెళుతున్న అధికారులకు రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

జహీరాబాద్‌ నిమ్జ్‌ కోసం అధికారుల బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ బాధిత రైతు కుమార్తె ఆవేదనతో విడుదల చేసిన వీడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం మామిడిగి గ్రామానికి చెందిన రైతు రాజారెడ్డి కుమార్తె అక్షయ నిమ్జ్‌ రైతుల దయనీయ స్థితిపై  విడుదల చేసిన ఒకటిన్నర నిమిషాల వీడియో సర్వత్రా చర్చనీయాశంగా మారింది. రైతులు భూములు ఇచ్చేందుకు వ్యతిరేకిస్తున్నప్పటికీ అధికారులు మాత్రంం సిద్ధమని ప్రకటించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. భూముల విక్రయాలు జరగకుండా రిజిస్ట్రేషన్లు బ్లాక్‌ చేయడం, 3 పంటలు పండే భూములు పండవని చూపడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు దఫాల్లో జరిగిన భూ బాధితుల సమావేశాల్లో పాల్గొన్నానని, భవిష్యత్తులో జరిగే ఆందోళనల్లోనూ పాల్గొంటానని స్పష్టం చేయడం జహీరాబాద్‌ ప్రాంత ప్రజలను ఆలోచింపజేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని